అభిమాన క‌థానాయ‌కుడిగా క‌లుసుకోవ‌డంలో ఉన్న ఆనందం... యువ క‌థానాయ‌కుడు నాని అనుభ‌వించాడు. ఇంకా ఆ అనుభూతుల్లోనే తేలిఆడుతున్నాడు. నానికి క‌మ‌ల్‌హాస‌న్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయ‌న్ని క‌లుసుకోవాల‌ని చాలాసార్లు అనుకొన్నా వీలుప‌డ‌లేదట‌. ఇప్పుడు అనుకోకుండా ఆ అవ‌కాశం వ‌చ్చింది.

నాని న‌టిస్తున్న ఓ సినిమా షూటింగ్ చెన్నైలో జ‌రుగుతోంది. ఆ ప‌క్క‌నే క‌మ‌ల్ హాస‌న్ త‌న సినిమా ప‌నుల్లో ఉన్నారు. ఈ సంగ‌తి తెలుసుకొన్న నాని.. త‌న సినిమా వ‌దిలేసి త‌న ఫేవ‌రెట్ హీరో షూటింగ్‌లో దూరిపోయాడు. అక్క‌డ క‌మ‌ల్‌ని క‌లుసుకొని `ఐయామ్ యువ‌ర్ ఫ్యాన్ స‌ర్‌` అన్నాడు.

అటునుంచి కూడా ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చింద‌ట‌. నీ సినిమాలు నేనూ చూశా.. అని క‌మ‌ల్ స‌మాధానం చెప్పాడ‌ట‌. దాంతో పొంగిపోయాడు నాని. త‌న జీవితంలో మ‌ర‌చిపోలేని క్ష‌ణాలు ఇవేన‌ని తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: